![]() |
![]() |
.webp)
పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైమతో కలిసి ఎన్నో వీడియోస్ చేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా ప్రవీణ్, డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్నాడు . ఇక పెళ్లి తర్వాత తొలి బోనాల పండుగను ఈ కొత్త జంట ఘనంగా జరుపుకుంది. బోనాల సందర్భంగా ప్రవీణ్-వంశిత వాళ్ళ ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వాళ్ళు చేసుకున్న బోనాల వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రవీణ్-కడెం వంశిత పెళ్లి జూన్‌లో ఓ గుడిలో జరిగింది. ఈ వివాహ వేడుకకు రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు కూడా పెళ్లికి హాజరై వీళ్ళను ఆశీర్వదించారు. సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. పెళ్లయ్యాక ప్రవీణ్, వంశిత ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అయ్యారు. ప్రవీణ్ ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కమెడియన్‌గా, సహాయక నటుడిగా కనిపిస్తున్నాడు. వంశిత కూడా డ్యాన్సర్‌గా తన కెరీర్‌లో కొనసాగుతోంది. వీళ్ళ పూజల వీడియోస్ పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. " అమ్మ నాన్న లేని వాళ్లకు మంచి భార్యను ఇస్తాడు అన్న ఆ దేవుడు నీకు కూడా మంచి భార్యను ఇచ్చాడు అన్న . గాడ్ బ్లేస్ యు అన్న. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |